హైదరాబాదులో ప్రశ్న రావణ్ నివాసంలో ఏపీ పోలీసుల తనిఖీలు
- గన్నవరం పోలీసులు చేపట్టిన తనిఖీలు
- కొన్ని పత్రాలు స్వాధీనం, రావణ్ భార్యను విచారించిన అధికారులు
- మొత్తం తనిఖీ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు
వివాదాస్పద యూట్యూబర్ బత్తుల జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ నివాసంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ శివార్లలోని అమీన్పూర్లో గల ఆయన నివాసంలో గన్నవరం పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి సాగిన ఈ సోదాల్లో కొన్ని కీలక పత్రాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
గన్నవరం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎనిమిది మంది అధికారుల బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొంది. సోదాల అనంతరం రావణ్ భార్యను విచారించిన పోలీసులు, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తనిఖీ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక పోలీసులు భద్రతతో పాటు ఇతర సహాయ సహకారాలను అందించారు.
గత రెండేళ్లుగా అమీన్‌పూర్‌లోని నరేంద్ర నగర్ కాలనీలో రావణ్ నివసిస్తున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు, ఇతర తీవ్ర ఆరోపణలకు సంబంధించి ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. కాగా, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద గన్నవరం పోలీసులు ఇటీవల రావణ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.